ఈ నియమాలను పాటిస్తే.. మీ ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

ఏది ఎలా ఉండాలి అనేది వాస్తు శాస్త్రం చెబుతోంది.

అలా ఉంటేనే మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రంలో ఉంది.అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ముఖ ద్వారం అందంగా ఉండాలి.చక్కగా అలంకరించినట్లు, మెరిసే రంగులతో ఉండాలి.

కాంతి బాగా ఉండాలి.చీకటి రంగులు అసలు వేసుకోకూడదు.

Advertisement

ఇంటి ముఖ ద్వారం దగ్గర సరైన కాంతి లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి అడుగు పెట్టదు.ఆమె బదులుగా దరిద్ర దేవత ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది.

ఎలాంటి పరిస్థితులలోనూ ఇంటి ముందు ప్రధాన ద్వారానికి గ్లాసుల అద్దాలు లాంటివి పెట్టకూడదు.

వాటి ప్రతిక్షేపనం అవుతుంది.అలా ఉంటే అయితే తల్లికి నచ్చదు.అమ్మవారికి బదులు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది.

ఇంటి గడప సరైంది గా ఉండాలి.మరి ఎత్తు ఎక్కువగా ఉండకూడదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!

ఆశుభ్రంగా అస్సలు ఉంచుకోకూడదు.ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తేలిగ్గా వచ్చేలా చూసుకోవాలి.

Advertisement

అప్పుడే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

ఇంటి ముందు ప్రధాన తలుపు ఇంట్లోనే మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండేలా చూసుకోవాలి.ఆ తలుపును లోపల నుంచి తెరిచేలా ఉండాలి.అలా తెలిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పకుండా అందమైన ముగ్గులు పెట్టడం మంచిది.అమ్మవారికి సంప్రదాయ ముగ్గులు అంటే చాలా ఇష్టం.

ఆ ముగ్గులతోనే మీపై అమ్మకి జాలి, దయా, ప్రేమ కలిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది.ఈ నియమాలను తప్పక పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు