కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

శీతాకాలం ప్రారంభం అయింది.చ‌లి పులి బ‌లంగా మారేందుకు ఇప్పుడిప్పుడే సిద్ధం అవుతోంది.

ప్ర‌జ‌లు కూడా చ‌లితో పోరాడేందుకు రెడీ అవుతున్నారు.అయితే కొంద‌రికి తీవ్ర‌మైన చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ఉంటుంది.

కానీ, కొంద‌రు మాత్రం కొద్ది పాటి చ‌లికే విప‌రీతంగా వ‌ణికి పోతుంటారు.ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా.? ఉంటే గ‌నుక ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.కొద్ది పాటి చ‌లికి వ‌ణికి పోవ‌డం అనేది మామూలు విష‌య‌మే అని అనుకుంటే పొర‌పాటే.

ఎందుకంటే అది కొన్ని వ్యాధుల‌కు సంకేతం.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

Advertisement
If You Feel More Cold Than Others Definitely Need To Know These! Cold, Winter, L

మ‌రి లేటెందుకు ఆ వివ‌రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండీ.ర‌క్త‌హీన‌త‌.

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మందిలో క‌నిపిస్తున్న స‌మ‌స్య ఇది.అయితే ర‌క్త హీన‌తను సూచించే ల‌క్ష‌ణాల్లో వ‌ణుకు కూడా ఒక‌టి.వాతావ‌ర‌ణం ఉష్ణోగ్ర‌త‌లు కొంచెం త‌గ్గినా.

ర‌క్త హీన‌త బారిన ప‌డిన వారి కాళ్లు, చేతులు చ‌ల్ల‌గా మారిపోయి వ‌ణికిపోతుంటారు.అందుకే పెద్ద‌గా చ‌లి లేక‌పోయినా వ‌ణుకు పుడుతుంటే త‌ప్ప‌ని స‌రిగా బ్ల‌డ్ టెస్ట్ చేయించుకోవాలి.

If You Feel More Cold Than Others Definitely Need To Know These Cold, Winter, L

అలాగే వ‌ణుకు థైరాయిడ్ వ్యాధిని కూడా సూచిస్తుంది.థైరాక్సిన్ హార్మోన్‌ ఉత్పత్తి సరిగ్గా కాన‌ప్పుడు.దాని ప్రభావం జీవక్రియపై ప‌డుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

దాంతో కొద్ది పాటి చ‌లికే తీవ్రంగా వ‌ణికి పోతుంటారు.ఒక వేళ ఇలా మీకు జ‌రుగుతుంటే గ‌నుక‌.

Advertisement

వైద్యుల‌ను సంప్ర‌దించి థైరాయిడ్ సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం ఉత్త‌మం.ఇక కొన్ని కొన్ని పోష‌కాల కొర‌త ఏర్ప‌డినా శ‌రీరం చ‌లిని త‌ట్టుకునే శ‌క్తిని కోల్పోతోంది.

ముఖ్యంగా విట‌మిన్ బి12, విట‌మిన్ సి మ‌రియు విట‌మిన్ డి వంటి పోష‌కాలు శ‌రీరానికి స‌రిగ్గా అంద‌డం లేదూ అంటే చ‌లి త‌క్కువ‌గా ఉన్నా.మీరు ఎక్కువ‌గా వ‌ణుకుతారు.

కాబ‌ట్టి, శ‌రీరానికి అన్ని పోష‌కాలు అందేలా చూసుకోండి.

" autoplay>

తాజా వార్తలు