Eyesight : ఈ ఒక్కటి తింటే చాలు కంటిచూపు పెరగడం ఖాయం..!

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు.

అయితే కంటిచూపు( Eyesight ) సమస్య రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి.

వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ( Electronic gadgets )ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.ఇక రెండవది ఆహార పదార్థాలు.

సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వలన కంటిచూపు సమస్యలు మొదలవుతాయి.అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి.

కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.కంటి సమస్యలు వస్తే ఒక జీవితం అంతా చీకటి మయమైపోతుంది.

Advertisement

అయితే కంటిచూపు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.దీంతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.కంటిచూపు మెరుగవ్వడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి.

కొన్ని బాదం పప్పులను ( Almonds ) శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి.అలా నానబెట్టిన బాదం గింజల పొట్టు తీసి చిన్న రోల్లో వేసి మెత్తగా ముద్దలాగ చేయాలి.

ఈ బాదం కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి.

ఇవి కంటిని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి.అంతేకాకుండా మంచి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అలాగే అనేక రకాల రోగాల బారి నుండి కూడా కాపాడుతుంది.ఇక రెండో పదార్థం మిరియాలు.ఒక ఐదు మిరియాలు( Pepper ) తీసుకొని ఇవి కూడా వేసి బాగా దంచి మెత్తగా ముద్దలాగ చేయాలి.

Advertisement

అలాగే పట్టిక బెల్లం( jaggery ) కూడా తీసుకోవాలి.ఒక స్పూన్ వరకు తీసుకొని ఓ చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి.ఇది కంటిచూపు మెరుగుపరచడంలో నూరు శాతం వరకు హెల్ప్ చేస్తుంది.

పాలలో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి.ఇప్పుడు ఈ పాలలో మనం తయారు చేసి పెట్టుకున్న బాదం, పట్టిక బెల్లం అలాగే మిరియాల పేస్టుని ఈ గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపాలి.

ఇక ఈ పాలను తరచూ ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవాలి.ఇలా తాగడం వలన అనేక రకాల కంటి సమస్యల నుండి కాపాడుకోవచ్చు.

తాజా వార్తలు