కార్తీక మాసం చివరి సోమవారం ఈ పని చేస్తే అంతా శుభమే!

హిందూ క్యాలెండర్ ప్రకారం ఎంతో పవిత్రమైన కార్తీక మాసం భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెల మొత్తం పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ విధంగా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను పెడుతూ పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు.

If You Do This On The Last Monday Of Karthika Month All Is Well , Karthika Masam

ఇక నేడు చివరి సోమవారం కనుక భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజించాలి. చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు ఉపవాసంతో స్వామి వారిని పూజించి దీపారాధన చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఇక నేడు ఉదయం సాయంత్రం నది స్నానాలను ఆచరించి పూజ చేయాలి.మనసు మొత్తం ఆ పరమేశ్వరుడు పై నుంచి మూడుసార్లు నదీ స్నానం చేసిన అనంతరం స్వామివారికి పూజ చేయాలి.

Advertisement

అదేవిధంగా నేడు ఉపవాసంతో స్వామి వారిని పూజించిన తర్వాత చాలా మంది భక్తులు కార్తీక వన భోజనాలు చేస్తారు.ఇక కార్తీక భోజనాలలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజలు చేసిన అనంతరం ఆ చెట్టు కిందే భోజనం చేస్తారు.

అలాగే నేడు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా దానధర్మాలను కూడా చేయాలని పండితులు సూచిస్తున్నారు.మన ఆర్థిక స్తోమతను బట్టి దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు