మేం గెలిస్తే అరాచకాలు, దోపిడీ ఉండదు..: మాజీ మంత్రి తుమ్మల

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి.అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం జిల్లాలోని గుట్టలను కొందరు మాయం చేశారన్న ఆయన మట్టిని సైతం దోచుకున్నారని ఆరోపించారు.

పాత బస్టాండ్ ను 99 ఏళ్ల లీజ్ పేరుతో ఆక్రమించాలని చూశారన్నారు.అయితే తాను గెలిస్తే ఇటువంటి అరాచకాలు ఉండవని చెప్పారు.

దోపిడీకి తావు ఉండదని తుమ్మల స్పష్టం చేశారు.ప్రస్తుతం బీఆర్ఎస్ ను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు.

Advertisement

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు