కర్ణాటక లో హంగ్ ఏర్పడితే ..? అన్ని పార్టీలు అలెర్ట్ !

కర్ణాటక( Karnataka ) ఎన్నికలు ఫలితం నేడు తేల నుంది.

  గెలుపు పై అన్ని పార్టీలు ధీమా ను వ్యక్తం చేస్తున్నా ,  హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్ గెలుపు పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడంతో , ఆ పార్టీలో ధీమా కనిపిస్తున్న , ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని,  గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగానే ఫలితాలు వెలువడ్డాయని బిజెపి  చెబుతోంది.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు కావడంతో కాంగ్రెస్ , బిజెపిలలో( Congress, BJP ) ఏదో ఒక పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉంది.అయితే రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగితే జెడిఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కీలకం అవుతారు.

 అలాగే ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.అదే జరిగితే తమ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం అన్ని పార్టీలకు ముఖ్యమే.దీంతో రిసార్ట్ రాజకీయాలు( Politics ) మొదలయ్యే అవకాశం లేకపోలేదు.

Advertisement

ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి తామే రాబోతున్నామనే ధీమాను వ్యక్తం చేస్తున్న, హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏమిటి అనే విషయంపైనే టెన్షన్ పడుతున్నాయి.గతంలో ఆపరేషన్ కమల ద్వారా జెడిఎస్ , కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని బిజెపి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.

అయితే ఈసారి ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.అంతేకాదు బిజెపిని ఎదుర్కొనేందుకు ఆపరేషన్ హస్తం నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతోంది.ముఖ్యంగా జెడిఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు అప్పుడే కాంగ్రెస్( Congress ) ప్రయత్నాలు మొదలు పెట్టింది.

దీంతో జెడిఎస్ కూడా అలెర్ట్అవుతుంది.

హంగ్ ఏర్పడే పరిస్థితులు తలెత్తితే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించేందుకు కూడా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.ఎగ్జిట్ పోల్స్  ప్రకారం కాంగ్రెస్ కనుక మెజార్టీ స్థానాలను గెలుచుకుంటే సీఎం అభ్యర్థుల రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పరమేశ్వరలు ఉన్నారు.ఇక బిజెపి ఎక్కువ స్థానాలను గెలిస్తే సీఎం గా బసవరాజు బొమ్మాయి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు