సర్క్యులర్ తప్పైతే జైలుకు వెళ్తా.. మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ( Krishank )ను మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.

క్రిశాంక్ తో మాట్లాడిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అయితే తాను జైలుకు వెళ్తానని కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని రుజువు చేస్తే ఆయన జైలుకు వెళ్తారా అని ప్రశ్నించారు.

If The Circular Is Wrong, You Will Go To Jail Former Minister KTR Comments , KTR

ఉద్దేశ పూర్వకంగానే క్రిశాంక్ పై కేసులు పెట్టారని మండిపడ్డారు.చేయని తప్పుకు క్రిశాంక్ ను అరెస్ట్ చేసి వారం రోజులుగా ప్రభుత్వం వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన రేవంత్ రెడ్డి సీఎంగా బయట తిరుగుతుండగా.ఏ తప్పు చేయని క్రిశాంక్ ను జైలులో పెట్టారని ఆరోపించారు.

Advertisement

ప్రతి దానికి బదులు చెప్పే సమయం వస్తుందన్న కేటీఆర్ తరువాత మిత్తితో సహా చెల్లిస్తామని వెల్లడించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు