NTR : ఐదుసార్లు రిపీట్ అయిన ఎన్టీఆర్ హిట్ సెంటిమెంట్… దేవర కూడా హిట్టే?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు హిట్ సెంటిమెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.ఇలా కొంతమంది హీరోల సినిమాల టైటిల్ విషయంలో సెంటిమెంట్స్ రిపీట్ అవుతుంటాయి.

సినిమాల విడుదల విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.అయితే ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ (NTR)ఇదివరకు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు.అయితే ఈయన డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి వారికి మంచి సక్సెస్ అందించారు.

ఇలా ఇప్పటికే ఈ సెంటిమెంట్ ఐదు సార్లు రిపీట్ కావడం విశేషం.

If That Sentiment Repeats Ntr Devara Turns Super Hit Movie
Advertisement
If That Sentiment Repeats Ntr Devara Turns Super Hit Movie-NTR : ఐదుస�

వంశీ పైడిపల్లి(Vamsi paidipalli) ప్రభాస్ హీరోగా మున్నా సినిమా(Munnaa Movie) చేశారు.ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది.అయితే ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత వంశీ పైడిపల్లి వైపు చూస్తే హీరోలే లేరు దీంతో ఎన్టీఆర్ తనకు అవకాశం ఇవ్వడంతో బృందావనం(Brundavanam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అప్పటివరకు వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి పూరి జగన్నాథ్ (Puri Jagannadh) టెంపర్ (Temper) సినిమా చేసే అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిట్ అందుకున్నారు.మహేష్ బాబు నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా చేసి ఫ్లాప్ లో ఉన్నటువంటి డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.

If That Sentiment Repeats Ntr Devara Turns Super Hit Movie

ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ టాప్ సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ బాబీకి జై లవకుశ (Jai Lavakusha)సినిమా అవకాశం ఇచ్చి సక్సెస్ అందుకున్నారు.

బొంబాయి సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ డిజాస్టర్ డైరెక్టర్ గా పేరుపొందారు.

Advertisement

అయితే ఆయనకు అరవింద సమేత (Aravinda Sametha) సినిమా అవకాశం ఇచ్చి మరొక హిట్ అందుకున్నారు.ఇలా ఫ్లాప్ లో ఉన్నటువంటి డైరెక్టర్లకు సినిమా అవకాశం ఇచ్చి హిట్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఆచార్య సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి కొరటాల శివతో (Koratala Shiva) సినిమా చేస్తున్నారు.ఎన్టీఆర్ విషయంలో ఇదే సెంటిమెంట్ కనుక మరోసారి రిపీట్ అయితే దేవర సినిమా (Devara Movie) కూడా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు భావిస్తున్నారు.

మరి ఆ సెంటిమెంట్ దేవర విషయంలో రిపీట్ అవుతుందా లేదా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు