Nithin Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను వాడుకొకపోతే నితిన్ కి హిట్ రాదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్( Nithin ) ఒకరు.

ఈయన కెరియర్ మొదట్లో మంచి విజయాలు అందుకున్నప్పటికీ మధ్యలో చాలా ప్లాప్ లు అయితే వచ్చాయి.

ఇక ఆ తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ బాట పట్టినప్పటికీ మళ్ళీ కొద్ది సంవత్సరాలుగా వరుస ప్లాపులు చవి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.ఇక దాంతో ఇప్పుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్( Robinhood Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

అలాగే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు( Thammudu ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టైటిల్ ని వాడుకుంటున్న నితిన్ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడతానని మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.అయితే నితిన్ కి ఎప్పుడైతే ఫ్లాప్ లు వస్తాయో అప్పుడే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు.

అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అతని మీద మండిపడుతున్నారు.ఇక మళ్ళీ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడరు.

Advertisement

ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన గురించి మాట్లాడుతూ ఆయన క్రేజ్ ను ఏదో ఒక విధంగా వాడుకుంటూ సక్సెస్ కొడుతూ ఉంటారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు నితిన్ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలోని ఒక సీను ను కూడా రీ క్రియేట్ చేయబోతున్నట్లు గా తెలుస్తుంది.దాంతో ఈ సినిమాలో ఫుల్ గా పవన్ కళ్యాణ్ ను వాడేసుకొని ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని నితిన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి మళ్ళీ నితిన్ పవన్ కళ్యాణ్ ను వాడుకొని ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో.

Advertisement

తాజా వార్తలు