వ్యాక్సిన్ వేసుకుంటే అంత ఓవరాక్షన్ చేయాలా... హీరోయిన్ సెటైర్

ప్రస్తుతం కరోనా వైరస్ జోరుగా విజ్రుంభిస్తున్న విషయం తెలిసిందే.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే కరోనా ఎంత నియంత్రించినా కనీసం ఏ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు.అయితే ప్రభుత్వాలు ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని, తద్వారా కరోనా బారిన పడకుండా ఉంటారని, శరీ రంలో హర్డ్ ఇమ్యూనిటీ పెరిగి తద్వారా కరోనా సోకినా రికవరీ అయ్యేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉందని, వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకునేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నాయి.

If Overexposure Should Be Done After Vaccination Heroine Asha Negi Satire, Actre

అయితే ప్రభుత్వం ఒక్కటే కాక సెలెబ్రెటీలు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సెలెబ్రెటీలపై టీవీ నటి ఆశా నేగీ సెటైర్ లు వేసింది.

వ్యాక్సిన్ వేసుకొని అందరికి అవగాహన కల్పిస్తున్నారు.అంతవరకు బాగానే ఉన్నా దయచేసి వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు కొద్దిగా మీ ఓవర్ యాక్షన్ తగ్గించండి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

Advertisement

ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది ప్రస్థావించకపోయినా ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు