మహేష్ అలా చేస్తే సినిమా హిట్టేనా...ఈ సారి కూడా బొమ్మ బ్లాక్ బాస్టరేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు.

ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

సర్కారు వారి పాట(Sarkaru Vari Pata) సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చేయబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే మే 31 ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు.ఇందులో మహేష్ బాబు తలకు కర్చీఫ్ కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ సిగరెట్ తాగుతూ కనిపించారు.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాకు గుంటూరు కారం(Gunturu Karam) అనే టైటిల్ పెట్టాలి అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ఇక ఈ పోస్టర్ వైరల్ కావడంతో అభిమానులు మహేష్ బాబు ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కాబోతుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదివరకు మహేష్ బాబు ఇలా తలకు బ్యాండ్ కట్టుకొని ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.మొదటిసారి మహేష్ బాబు ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి(Pokiri) సినిమాలో కనిపించారు.ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఆ తర్వాత కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు(Sreemanthudu) సినిమాలో కూడా మహేష్ బాబు ఇలాగే తలకు బ్యాండ్ కట్టుకొని కనిపించారు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కూడా మహేష్ బాబు తలకు బ్యాండ్ కట్టుకోవడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు ఈ పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు.మరి ఈ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు