జగన్ మద్దతు ఇవ్వకపోతే... బీజేపీ టార్గెట్ వారే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి( BJP ) ఎన్ డి ఏ లోని మిత్రపక్షలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సరైన మెజారిటీ రాకపోవడం తో గతంలో మాదిరిగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.

ముఖ్యంగా ఎన్డీఏ కోటమికి రాజ్యసభలో తగినంత భావం లేకపోవడంతో,  ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారాయి.  ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే తప్ప బిల్లులు ఆమోదం పొందే పరిస్థితి లేదు.

ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు,( Chandrababu ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) ఇటీవల ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే దానిపైన చర్చ జరిగిందట.

అయితే ప్రస్తుతం అన్ని విషయాల్లో వైసిపి ఎన్ డి ఏ కు మద్దతు తెలుపుతోంది .ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసిపి మద్దతు ఇచ్చింది.

Advertisement

దీంతో ఇప్పుడు వైసీపీకి( YCP ) చెందిన రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఏముంది ఒకవేళ జగన్ ఎన్డిఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా రాజ్యసభలో తమ సభ్యుల ద్వారా వ్యతిరేక ఓటు వేస్తే అప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణి కూడా బిజెపి పెద్దలలో కనిపిస్తోంది.రాజ్యసభలో( Rajyasabha ) మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా,  పదవీ విరమణ కారణంగా ప్రస్తుతం 225 మంది ఉన్నారు.సభలో మెజారిటీ సాధించాలంటే 113 మంది సభ్యులు మద్దతు అవసరం.

ఈ సభలో ప్రస్తుతం బిజెపి బలం 86 .బిజెపి సారధ్యంలోని ఎన్డీఏకు 101 మంది ఉన్నారు.ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 87.అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి లో లేని పార్టీలో 11 మంది సభ్యులతో వైసిపి అతిపెద్ద పార్టీగా ఉంది. 

బిజెడి కి 9,  బీఆర్ఎస్ కు నాలుగు, ఏఐఏడీఎంకే పార్టీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు.వీళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు ఆమోదం పొందడం కష్టం.అందుకే వైసిపి నుంచి కొంతమందిని బిజెపిలో చేర్చుకుంటే మంచిదనే విషయంపైనే చంద్రబాబు అమిత్ షా కు సూచించారు.

వైసిపి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య,  పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు,  మరో ఎంపీ కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ చేరికల విషయంలో బిజెపి ఆచి తూచి వ్యవహరిస్తోంది.

పాము చేసిన పనికి అమెరికాలో 11 వేల మందికి ఇబ్బంది..?
అనుష్క-ఎన్టీఆర్‌ల మధ్య పెద్ద గొడవ.. అందుకే ఒక్క సినిమా కూడా చేయలేదు..?

ప్రస్తుతానికి వైసిపి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుండడంతో ,వైసిపి రాజ్యసభ సభ్యులను చేర్చుకునే విషయంలో మరి కొంతకాలం వేచి చూస్తే మంచిదనే ఆలోచనలో బిజెపి అగ్ర నేతలు ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు