జగన్ గారూ ఇదొక్కటే చేయగలిగితే మీకు తిరుగుండదు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశాల్లో చదువుకుని రావడం వలన ఆయనకు తెలుగుమీద అంతగా పరిజ్ఞానం లేకుండా పోయిందని చెప్పవచ్చు.

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ది కూడా అదే పరిస్థితి.

గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగులో చాలా బాగా మాట్లాడేవారు.ఇక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుగును కిచిడీ చేసేవారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏపీ ముఖ్యమంత్రి తెలుగు భాషపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

మాతృభాషలో తడబాటెందుకు.

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మంచి వాగ్దాటి. తెలుగు,ఇంగ్లీష్, హిందీలో రఫ్ఫాడిస్తారు.

Advertisement
If Jagan Could Only Do This, Wouldn T You Like It , Jagan, Ycp , Ap , Cm Jagan,C

అసెంబ్లీలో ఓవైసీ బ్రదర్‌ కోసం అప్పుడప్పుడు ఉర్దూ కూడా మాట్లాడుతుంటారు.తెలుగు మాట్లాడే రాష్ట్రం తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు.

మరో తెలుగు రాష్టమైన ఏపీకి జగన్ సీఎంగా ఉన్నారు.కానీ జగన్ తెలుగు మాట్లాడే విధానంపై అంతా కామెంట్స్ చేస్తున్నారు.

మాతృభాషలో మాట్లాడేందుకు సీఎం గారూ ఎందుకు తడబడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

If Jagan Could Only Do This, Wouldn T You Like It , Jagan, Ycp , Ap , Cm Jagan,c

ఒక తెలుగు రాష్ట్రాన్ని నడిపే నేత తెలుగు భాష ఎంత చక్కగా ఉండాలి.తెలుగు నుడికారంలో స్వచ్ఛమయిన పలుకు ఉచ్ఛారణ దోషాలకు తావివ్వని పలుకు ఉంటే ఎంతో బాగుంటుంది.సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండి తప్పులు మాట్లాడితే వేరు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

కానీ సీఎం స్థానంలో ఉండి తప్పులు మాట్లాడితే ఆయన్ను చూసి విద్యార్థులు,రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

If Jagan Could Only Do This, Wouldn T You Like It , Jagan, Ycp , Ap , Cm Jagan,c
Advertisement

జగన్ తెలుగులో బానే మాట్లాడుతారు.కానీ కొన్ని పదాలు పలుకడంలో ఆయన ఎందుకో వెనుకాముందు అవుతారు.ఉదా.ఉటంకించారు అన్న పదాన్ని ఉటకించారు అంటారు.స్వేచ్ఛ అనే పదాన్ని స్వేచ్ఛం అని అంటారు.

అసమానతలు అనే పదం పలకడంలోనూ తప్పలు చేస్తుంటారు.ఇలా కొన్ని పదాలను కఠినంగా ఫీలవుతుంటారు.

అందుకే ఆయన తప్పుగా పలుకుతారని కొందరు అంటున్నారు.కానీ ముఖ్యమంత్రి తెలుగుపై ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తుంటే వైసీపీ లీడర్లు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారట.

జగన్ ఈ ఒక్క విషయంలో కొంచెం తప్పిదాలు రాకుండా చూసుకుంటే ఆయన పాలనకు ఎదురుండదని అంతా అంటున్నారు.

తాజా వార్తలు