జగన్ మళ్ళీ వస్తే ఏపి పూర్తిగా నష్టపోతుంది - టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కామెంట్స్.పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి.

పోలవరం ప్రాజెక్టుకు జగన్ శనిలా తయారయ్యాడు.గోదావరిపై ధవళేశ్వరం తప్ప మరోటి లేకపోవడంపై కాటన్ దొర మనుమరాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ కు 21 ప్రశ్నలు సందిస్తున్నా, వాటికి సమాధానం చెప్పాలి.టీడీపీ అధికారంలో ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 2020 డిసెంబర్ కు పూర్తి అయ్యేది.

జగన్ సీఎం అవ్వడంతో 2030 నాటికి కూడా పూర్తయ్యేలా లేదు.దీనికి జగన్ రివర్స్ టెండరింగ్ విధానం కారణం.

Advertisement

అక్కడ పనిచేసే ఏజెన్సీలను రద్దుచేసి, అనుభవం లేనివారిని నియమించారు.జగన్ మళ్ళీ వస్తే ఏపి పూర్తిగా నష్టపోతుంది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు