ఆ గండం దాటితే ఇండియా కూటమి సూపర్ హిట్టే?

అనేక సమాలోచనలు తర్వాత ఏర్పాటు చేయబడిన ఇండియా కూటమి కి ఇప్పుడు అతిపెద్ద పరీక్ష ఎదురయింది.

ప్రధాన పదవికి అభ్యర్ధిని ఎన్నుకోవటమే ఇప్పుడు విపక్షాల ఐక్యతకు అతిపెద్ద పరీక్షగా నిలవనున్నట్టు తెలుస్తుంది.

బాజాపా( BJP party ) ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి కట్టిన విపక్ష పార్టీలు ఇప్పుడు పదవులు పంపకం దగ్గర మాత్రం తలో పక్కా లాగుతున్నాయి .ఎందుకంటే దాదాపు అరడజను కు పైగా ప్రధానమంత్రి అభ్యర్థులు ఆ కూటమిలో ఉండటమే అసలు కారణం ఒకపక్క శరత్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ( Mamata Banerjee )మరోపక్క నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్తగా ఆప్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయింది.

If It Crosses That Line Will Indias Alliance Become A Super Hit, Nitish Kumar

నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆప్ పార్టీ ఇప్పుడు తమ అధినేతఅరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది .ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఢిల్లీని సమర్థవంతంగా నడిపిస్తున్న తమ అధినేత దేశాన్ని కూడా నడిపించగలడంటూ వ్యాఖ్యలు చేశారు .అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ లో పెట్టిన తమ ముఖ్యమంత్రి దేశాన్ని పాలించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం .అంతేకాకుండా ఒకవైపు టెక్నాలజీలో ముందుకు వెళ్తూనే మరో ప్రక్క వ్యవసాయాన్ని బలపరుస్తున్నామని వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ ను ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు నడిపించగలరని ఆమె చెప్పుకొచ్చారు .

If It Crosses That Line Will Indias Alliance Become A Super Hit, Nitish Kumar

దాంతో ఇప్పుడు ప్రధాని అభ్యర్థుల లిస్ట్ లో ఒక పేరు పెరిగింది .ఇప్పటికే కనీసం కన్వీనర్ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై ఎదురవుతున్న సవాలు విపక్షల ఐక్యత గాలి బుడగ అని మరోసారి నిరూపిత మవుతుందా అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి .ఒక్క సారి ఈ గండం నుండి గట్టెక్కితే విపక్షాల ఐక్యతకు తిరుగులేదని నిరూపించడం సాధ్యమవుతుంది.మరి దేశ ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాల విషయంలో ఈ పార్టీలు ఎంతవరకు రాజీ పడతాయో చూడాలి .

Advertisement
If It Crosses That Line Will India's Alliance Become A Super Hit, Nitish Kumar
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

తాజా వార్తలు