ఆ సినిమా చేసి ఉంటే చిరంజీవి ఇండియా లోనే నెంబర్ వన్ హీరో అయ్యేవాడు...

ఇప్పుడు కొత్తగా అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కానీ ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) పాన్ ఇండియా స్టార్ గా అబూ అనే సినిమా( Abu ) తీయాలి అనుకున్నాడు అది కొంచం షూట్ కూడా జరుపుకుంది కానీ దాంట్లో కొన్ని సీన్లు ముస్లింలను అవమానించే విధం గా ఉన్నాయి అని తెలిసి వాళ్ళు ఆ సినిమా మీద కేసు వేశారు.

దానితో ఈ సినిమా అనేది ఆగిపోయింది ఇక ఇక చిరంజీవి చేయాల్సిన ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇలా ఆగిపోయింది లేకపోతే చిరంజీవి ఎప్పుడో పాన్ ఇండియా హీరో గా ఎదిగేవాడు.

ప్రస్తుతం చాలా మంది హీరోలు ఆ పాన్ ఇండియా హీరో గా ఎదగడానికి నాన తంటాలు పడుతున్నారు.

అయితే ఈ సినిమా కి డైరెక్టర్ గా భాషా లాంటి సినిమాతో ఇండస్ట్రీ లో తనకంటు ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సురేష్ కృష్ణ డైరెక్టర్ గా ఉన్నాడు అలాంటి ఆయన డైరెక్షన్ లో తెరెకెక్కాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోవడం నిజంగా భాద ని కల్గించే విషయం అనే చెప్పాలి.

లేకపోతే ఇప్పటికీ చిరంజీవి ఇండియా మొత్తాన్ని శాసించే ఒక స్టార్ హీరో అయ్యేవాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఉన్న ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన చేసిన భోళా శంకర్ సినిమా( Bholaa Shankar ) ప్లాప్ అయినా విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఇక ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తో మరో హిట్ కూడా తన ఖాతా లో వేసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా హిట్ అయితే డైరెక్టర్ వశిష్ట కూడా తో టాప్ డైరెక్టర్ అయిపోతాడు.

Advertisement

తాజా వార్తలు