ఖాళీ కడుపుతో నెయ్యిని ఇలా తీసుకుంటే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది!

మలబద్ధకం.ప్రస్తుత రోజుల్లో అత్యధిక శాతం మందిని చాలా కామన్ గా వేధిస్తున్న సమస్య ఇది.

మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావలసిన నీటిని అందించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.ఇది చిన్న సమస్యగానే కనిపించిన నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పును తెచ్చి పెడుతుంది.

జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, హైపర్ టెన్షన్ వంటి ఎన్నో సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందుకే మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు నెయ్యి ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా నెయ్యిని తీసుకుంటే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు లేటు నెయ్యిని ఎలా తీసుకుంటే మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము వేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

Advertisement

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో చిటికెడు పింక్‌ సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసి తాగేయడమే.

ఈ డ్రింక్ ని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.దీంతో మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

పైగా ఈ డ్రింక్ ను తీసుకుంటే రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు వాపు వంటి సమస్యలు ఉంటే దూరమవుతాయి.మరియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మలినాలు సైతం తొలగిపోతాయి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు