బాబు అలా చేస్తే.. మరి పవన్ ?

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడే కొద్ది ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీని( ycp ) గద్దె దించేందుకు అన్నీ పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.

ఇప్పటికే జనసేనతో పొత్తును కన్ఫర్మ్ చేసిన టీడీపీ.బీజేపీతో కూడా పొత్తు కోసం గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

అయితే టీడీపీతో( tdp ) కలిసేందుకు బీజేపీ( bjp ) పెద్దలు మాత్రం సుముఖత చూపడం లేదు.

Advertisement

ఈ నేపథ్యంలో కాంగ్రెస్( congress ) తో జట్టు కడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా టీడీపీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తెలంగాణలో కాంగ్రెస్ మరియు టీడీపీ మద్య అంతర్గత పొత్తు ఉందనే వార్తలు గట్టిగా వినిపించాయి.

ఎందుకంటే కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ నేతలు టీడీపీ పట్ల సానుకూలంగా స్పందించడం, అలాగే కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత గాంధీభవన్( Gandhi Bhavan ) ముందు టీడీపీ జెండాలు కనిపించడం వంటి సంఘటనలు పరిశీలిస్తే టీడీపీ మరియు కాంగ్రెస్ మద్య అంతర్గత దోస్తీ ఉందనేది కొందరు చెబుతున్నా మాట.

ఈ నేపథ్యంలో ఇదే దోస్తీ ఏపీలో కూడా కొనసాగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 17 న అమరావతి రాజధాని అంశంపై ఓ భాహిరంగ సభ జరగుంది.ఈ సభకు చంద్రబాబుతో పవన్ కూడా హాజరవుతున్నారు.

అలాగే ఏపీ జెఎస్సి కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీని( Priyanka Gandhi ) ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.ఇదే గనుక నిజం అయితే ఏపీలో కూడా టీడీపీ కాంగ్రెస్ మద్య దోస్తీ కుదిరే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

అయితే ఆల్రెడీ టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అటు బీజేపీతో కూడా స్నేహంగా మెలుగుతోంది.ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ కలిస్తే జనసేన కూడా కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.మరి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు