YCP MLA anam ramanarayana reddy : ఈ ఐదు సంవత్సరాలు చివరిరోజు వరకు వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతాను.. ఆనం

నేను ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీ నిర్ణయం అనేది చెప్పాల్సింది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిముందుగా ఊహించుకుని ఇక్కడే పోటీ చేస్తాను అనేది నేను చెప్పడం కాదు.

ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఆ అర్హత ఉంది.

ఇక్కడ ఎవరు పోటీ చేయాలనేది మేము కాదు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం.

I Will Continue As YCP MLA For Five Years Till The Last Day.. Anam, Anam Ramana

నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేందుకే టికెట్ ఇచ్చారు.ఈ ఐదు సంవత్సరాలు చివరిరోజు వరకు వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతాను.

మీడియా కథనాల్లో వస్తున్నట్లు నాకు వేరే ఆలోచన అనేది ఉంటే, ఆ మాట రాబోయే ముందే నా కాగితం ప్రక్కన బెట్టి చెపుతాను.నా రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానాలు అక్కరలేదు.

Advertisement

నియోజకవర్గంలో పార్టీ అంతా ఏక నాయకత్వం క్రింద నడుస్తున్నప్పుడు సమస్య అనేది ఎక్కడ ఉంది.ఉన్న ఈ ఒకటిన్నర సంవత్సరం వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిపై అందరూ కలిసి పనిచేద్దాం.

ఎమ్మెల్యే హోదాలో చివరిరోజు వరకు నేను ఉన్న నియోజకవర్గానికి న్యాయం చేయడమే నా పని.

Advertisement

తాజా వార్తలు