Samantha: ఎవరికి నచ్చకున్నా ఆ ఇద్దరితో మాత్రం రిలేషన్ లో ఉంటా.. సమంత షాకింగ్ పోస్ట్..!!

సమంత ( Samantha ) ఈ మధ్యకాలంలో ఖుషి సినిమా( Kushi movie )తో తన అభిమానులను అలరించింది.

ప్రస్తుతం సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుంది.

దానికి కారణం మయాసైటిస్ వ్యాధికి చికిత్స కోసం సమంత అమెరికాకు పయనమైన సంగతి మనకు తెలిసిందే.

ఇక అక్కడ కేవలం ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా తన మైండ్ రిఫ్రెష్ గా ఉండడం కోసం అక్కడ ఉండే అందమైన ప్రదేశాలను చుట్టి వస్తుంది.ఇప్పటికే యూరప్,అమెరికా ( America ) ను చుట్టేసి అక్కడ దిగిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది.ఇక తాజాగా సమంత ఆస్ట్రియాలోని వియన్నా లో ఉంది.

ఇక అక్కడ సమంత ఒక గోడ ముందు నిల్చొని తన సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫోటో షేర్ చేస్తూనే ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఆ ఇద్దరితో ఉంటా అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.ఇక ఆ పోస్టులో ఏముందంటే.

Advertisement

సమంత ( Samantha ) ఒక గోడ ముందు నిల్చుని ఉంది.ఆ గోడపై Everybodys Darling అని రాసి ఉంది.

ఇక అక్కడ ఓ ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ "Or not.I can live with both" అంటూ రాసుకోచ్చింది.అయితే సమంత పెట్టిన పోస్ట్ కి అర్థం ఏమిటంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఆ ఇద్దరితో కలిసే ఉంటా అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ వెనుక అర్థం ఏంటోనని చాలామంది నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.ఇంతకీ సమంత ఏ ఇద్దరితో కలిసి ఉంటుంది.వాళ్ళు ఎవరు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కి కామెంట్లు పెడుతున్నారు.

మరి సమంత పెట్టిన పోస్ట్ కి అర్థం ఏంటో అనేది తెలియాల్సి ఉంది.ఇక సమంత పెట్టిన పోస్ట్ కి త్రిష ( Trisha ) స్మైల్ తో స్పందించింది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు