రోజుకు రూ.25 లతోనే బ్రతికాను... నటుడు సంచలన వ్యాఖ్యలు!

సాధారణంగా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది.

అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఇలాంటి అవమానాలను తాను ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్( Sarath Kelkar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.బుల్లితెర నటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన అనంతరం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా(Voice Over Artist) ప్రయాణం కొనసాగించారు.2004 లో హల్ చల్ ( Hal chal )సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకున్నారు.

శరద్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠి భాషా సినిమాల్లో నటించారు.టాలీవుడ్‌లో సర్దార్ గబ్బర్‌ సింగ్ మూవీలో( Sardar Gabbar Singh movie ) రాజా భైరోన్ సింగ్ పాత్రలో నటించి సందడి చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శరత్ కేల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను అనుభవించిన కష్టాల గురించి తెలియజేశారు.

సైరస్ బ్రోచా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శరత్ 2002లో తాను ముంబై వచ్చానని, ఆ సమయంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలియజేశారు.

Advertisement

ముంబై వచ్చిన తాను బాద్రాలోని బజార్ రోడ్డులో ఒక గదిలో ఉండేవాడినని తెలియజేశారు.ఇలా ఒక చిన్న గదిలో ఏకంగా తొమ్మిది మంది కలిసి ఉండే వారి మని తెలిపారు.అదే రూమ్‌ను రాజస్థానీ డాబాగా ఉపయోగించేది.

అక్కడ ఒక చపాతీ 2 రూపాయలకు అమ్మేవారు.అక్కడే నేను గ్యాస్ సిలిండర్లు చూసుకునేవాడిని.

అందుకు వారితో నేను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను.ప్రతిరోజు నాలుగు గుడ్లు రెండు చపాతీలు రెండు పూటలా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాను.

అలా రోజుకు 25 రూపాయలతోనే తాను బ్రతికానని శరత్ కేల్కర్ వెల్లడించారు.తరువాత తాను ఒక జిమ్‌లో నెలకు రూ.2750 సంపాదించేవాడినని ఆ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో రూ.5000 ఆఫర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని ఈ సందర్భంగా శరత్ కేల్కర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు