భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్( Mary Kom ) తన రిటైర్మెంట్ పై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు.
రిటైర్మెంట్ పేరుతో వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.
తాను ఎలాంటి రిటైర్మెంట్( Mary Kom Retirement ) ను ప్రకటించలేదని మేరీకోమ్ పేర్కొన్నారు.ఆట నుంచి వైదొలగాలనుకున్నప్పుడు తానే ప్రతి ఒక్కరికీ తెలియజేస్తానని తెలిపారు.
ప్రస్తుతం తన దృష్టి అంతా ఫిట్ నెస్ పైనే ఉందన్నారు.అయితే ఇటీవల ఓ స్కూల్ కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని మేరీకోమ్ తెలిపారు. ఒలింపిక్స్( Olympics ) లో పోటీకి వయోపరిమితి అడ్డంగా ఉందని చెప్పానన్న ఆమె ఆడగల సామర్థ్యం ఉన్నప్పటికీ వయసు వలన ఒలింపిక్స్ ఆడలేకపోతున్నానని చెప్పానని స్పష్టం చేశారు.
ఈ మాటలనే కొందరు రిటైర్మెంట్ గా అర్థం చేసుకున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy