జ‌గ‌న్ వ‌ల్ల కాదు.. నా వ‌ల్లే వైసీపీ గెలిచింది... ఆ ఎమ్మెల్యే చిర్రుబుర్రు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో ఓ యువ ఎమ్మెల్యే వైఖ‌రి పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల పేరు చెపితేనే కొన్ని ద‌శాబ్దాలుగా మాజీ మంత్రులు రామ‌సుబ్బా రెడ్డి, ఆది నారాయ‌ణ రెడ్డి పేర్లే వినిపించేవి.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు రాజ‌కీయ ఉద్దండుల‌కు చెక్ పెట్టి యువ డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యం సాధించారు.సుధీర్ రెడ్డి ఏకంగా 53 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డం.

పైగా ఇక్క‌డ రామ‌సుబ్బా రెడ్డి, ఆది నారాయ‌ణ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నా.ఈ రెండు వ‌ర్గాల‌ను ఢీ కొట్టి గెల‌వ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

అయితే సుధీర్ రెడ్డి 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాక ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి.వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ కుటుంబానికి పార్టీల‌తో సంబంధం లేకుండా 30 - 35 వేల ఓటు బ్యాంకు ఉంది.

Advertisement
I Am The Reason For The YCP Victory..YCP MLA, YCP, YCP MLA, Reason, Victory, Jam

వైఎస్ కుటుంబానికి బ‌ల‌మైన బంధుగ‌ణం ఉంది.ఇక్క‌డ వైఎస్ బంధువుల హ‌వా కూడా ఎక్కువే.

అయితే సుధీర్ రెడ్డికి వీళ్ల‌తో పాటు వైసీపీలోని ముఖ్య‌మైన నాయ‌కుల‌తో ఏ మాత్రం పొస‌గ‌డం లేదు.ఆయ‌న కింది స్థాయి కేడ‌ర్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

I Am The Reason For The Ycp Victory..ycp Mla, Ycp, Ycp Mla, Reason, Victory, Jam

జ‌గ‌న్ బంధువులు అయితే ఏంటి.ఇక్క‌డ నేను క‌ష్ట‌ప‌డి గెలిచాను.నేనే ఎమ్మెల్యేను.

ఇక్క‌డ ఏం జ‌రిగినా నా క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాల‌ని హుకూం జారీ చేస్తున్నార‌ట సుధీర్‌.డాక్ట‌ర్ గా ఆయ‌న‌కు మంచి పేరు ఉన్నా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

రాజ‌కీయంగా ఆయ‌న ఎవ‌రిని ఎలా ?  డీల్ చేయాలో తెలియ‌క త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.ఇక కాంట్రాక్టులు, ఇత‌ర పనులు కూడా ఎవ్వ‌రికి ఇవ్వ‌డం లేద‌ట‌.

Advertisement

దీంతో పార్టీలో ద్వితీయ శ్రేణి కేడ‌ర్లో సుధీర్ రెడ్డిపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.ఆయ‌న్ను వ్య‌తిరేకించే వారంతా మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి చెంత చేర‌డంతో ఆయ‌న రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్నారు.

మ‌రి సుధీర్ రెడ్డి తీరు మార‌క‌పోతే జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ ఏక‌చ‌క్రాధిప‌త్యానికి, ఆయ‌న‌కు గండి ప‌డ‌క త‌ప్ప‌దు.

తాజా వార్తలు