Vishwak sen: వివాదాలపై షాకింగ్ కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్.. నోరు మూసుకుని పోనంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌( Vishwak sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విశ్వక్‌ సేన్‌ నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ.

( Das Ka Dhamki ) ఈ సినిమా నేడు అనగా 22న విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల అయింది.

సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియాతో ముచ్చటించిన విశ్వక్‌ సేన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.

నాకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఎవరూ లేదు.నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

ఎందుకొచ్చిన గొడవరా అని మూసుకొనిపోతే మూడు నాలుగు వివాదాలు జరిగేవి కావు.

నామీదికి వస్తే నేను ప్రశ్నిస్తా, నేను ఎదురు మాట్లాడతాను.ఎందుకంటే నన్ను ఎవరూ ప్రొటెక్ట్ చేయరు.నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి.

తుడుచుకొని పోతే కాంట్రవర్సీలు కావు.ఒక్కడినే వచ్చాను కాబట్టి రాళ్లు వేస్తారు.పది మంది ఉన్న వాళ్లపై రాళ్లు వేయరు.

ఒంటరి వాడిపైనే రాళ్లు విసురుతుంటారు.వాటికి నేను ఆన్సర్‌ చెబుతా కాబట్టి వివాదం అవుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తుడుచుకొని పోతే వివాదం కాదు, నేను తుడుచుకుని పోయే రకం కాదు అంటూ వివాదాలపై ( Controversies ) కాస్త ఘాటుగా స్పందించాడు విశ్వక్‌ సేన్‌.అలాగే వివాదాలు సృష్టించుకునేంత కర్మ కూడా నాకు లేదు.

Advertisement

చాలా మంచి సినిమాలు చేస్తున్నా, వాటిని ఆడియెన్స్ చూస్తున్నారు.కాంట్రవర్సీలు చేశానని అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకి ఓపెనింగ్‌ రాలేదు.

బాగుందనేటాక్‌ వచ్చాకనే మ్యాట్నీ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి.వివాదం అయ్యిందనే ఆడియెన్స్ రాలేదు అని తెలిపారు విశ్వక్‌ సేన్‌.ఇక తన సినిమా ప్రమోషన్లకి ఎన్టీఆర్‌, బాలయ్య, రామ్‌చరణ్‌ వంటి పెద్ద హీరోల సపోర్ట్ పై స్పందిస్తూ, నేను బేసిక్‌ గా నామూషి మనిషిని.

అడిగితే వస్తారా?రారా? రాకపోతే బాధగా ఉంటుందేమో అనుకునేవాడిని.నన్ను అర్థం చేసుకున్న వాళ్లు వస్తారనే నమ్మకం వచ్చాక అడిగాను, ఎన్టీఆర్ అన్నా కావచ్చు, రామ్‌చరణ్‌ కావచ్చు, మిగిలిన హీరోలు కూడా నేను అడిగినది ఎప్పుడూ కాదనలేదు.

అందరం కలిసి ఉంటాం, సపోర్ట్ చేసుకుంటామనేదానికి మిగిలిన ఇండస్ట్రీల వారికి కూడా ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.అయితే పెద్ద స్టార్లు సపోర్ట్ చేయడం అనేది బ్లెస్సింగ్స్ గా భావిస్తున్నాను అంటూ కాస్త ఘాటుగా స్పందించారు విశ్వక్ సేన్.

.

తాజా వార్తలు