ఎంత ఆస్తి అమ్మానో అంతకు రెండింతలు కొన్నాను.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

బుల్లితెర కమెడియన్ గా ఎంత మంచి సక్సెస్ అయినటువంటి హైపర్ ఆది ( Hyper Aadi ) ప్రస్తుతం జనసేన పార్టీ ( Janasena Party ) ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన జనసేన స్టార్ క్యాంపెనర్ గా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈయన కెరియర్ మొదట్లో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేసేవారు.అయితే అంతకుముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశారని పలు సందర్భాలలో ఆది తెలిపారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు విషయాలను వెల్లడించారు.తనకు ఒకే చోట కూర్చొని ఉద్యోగం చేయడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని అందుకే తాను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేశానని తెలిపారు.అయితే అప్పటికే మా చదువుల కోసం నాన్న ఎన్నో అప్పులు చేశారు.

ఈ అప్పులు తీర్చుకోవాలి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇంట్లో వారికి నా మనసులో మాట చెప్పాను.నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు నేను వేరే పని చేసుకుంటాను అప్పులు తీరాలంటే ఉన్న మూడు ఎకరాల పొలం అమ్మమని చెప్పాను.

Advertisement

ఇలా నేను ఉద్యోగం మానేయడమే ఇంట్లో ఒప్పుకోలేదు ఇక పొలం అమ్మే విషయంలో ఎవరూ ఒప్పుకోలేదు కానీ చివరికి పొలం అమ్మేసి అప్పులన్నీ తీర్చమని తెలిపారు.ఇలా అప్పులు తీరగానే నేను జబర్దస్త్ పై కాన్సన్ట్రేషన్ పెట్టానని తెలిపారు.ఇక జబర్దస్త్ లో మంచి సక్సెస్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని అయితే నేను ఎంత పొలం అయితే అమ్మామో అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేశాము అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు