మొదటిసారి తన లవ్ స్టోరీ చెప్పిన హైపర్ ఆది.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు బుల్లితెర పేక్షకులకు ఢీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కాగా ఇప్పటికే 13 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 14వ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఢీ షో గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా తక్కువగా ప్రేక్షకాదరన పొందింది అని చెప్పవచ్చు.ఈ సీజన్ లో యాంకర్ రష్మి,సుడిగాలి సుధీర్ కనిపించకపోవడం అందుకు ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు.

అయితే రష్మీ, సుధీర్ ఈ షోలో కనిపించకపోయేసరికి వారిద్దరి అభిమానులు చేసిన హంగామా రచ్చ అంతా కాదు.షో మొదట్లో ఈ ఢీ షో వీడియో కింద సుధీర్ అన్న రావాలి రష్మి రావాలి అంటూ వేలాదిమంది కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ఢీ షో కి యాంకర్ ప్రదీప్ పోస్ట్ కి వ్యవహరిస్తుండగా.జానీ మాస్టర్‌, పూర్ణ, శ్రద్ధాదాస్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే ఈ ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.ప్రతివారం అదిరిపోయే థీమ్ లతో, అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ఢీ షో ఈ వారం అంతకుమించి ఉండబోతోంది అన్నది ప్రోమో ను బట్టి చూస్తే అర్థమవుతోంది.

అయితే లవ్‌ థీమ్‌తో చేసిన డ్యాన్సులు అలరించనునున్నారు డాన్సర్స్.ఇది ఇలా ఉంటే ఈ ప్రోమోలో హైపర్‌ ఆది లవ్‌ స్టోరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

లవ్‌ థీమ్‌లో భాగంగా షోలో పార్టిసిపెంట్స్‌ తమ ఫస్ట్ లవ్ గురించి స్టేజ్‌ మీద పంచుకోవాల్సి ఉంది.ఈ సందర్భంగా హైపర్ ఆది తన మొదటి లవ్ గురించి తెలిపాడు.8వ తరగతి వరకూ ఆది తన ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలో చదివాడట.ఆ తరువాత 9వ తరగతి కోసమని ప్రైవేట్‌ స్కూల్‌కి మారాడట.

అయితే అప్పుడు ఒక అమ్మాయి వచ్చిందని చెప్తూ తెగ మురిసిపోయాడు ఆది.క్లాస్ నుండి బయటకు వస్తుండగా ఆ అమ్మాయిని చూశానని, ఆ ఫీలింగ్‌ని వర్ణించలేనంటూ సిగ్గుపడిపోయాడు.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇక ఈ ఎపిసోడ్‌ ఆగస్ట్ 24న ప్రసారం కానుంది.మరి ఈ ప్రోమో కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Advertisement