ఢీ షో కావాలా పవన్ కావాలా తేల్చుకోవాలన్న నిర్మాత.. హైపర్ ఆది ఏం చేశారంటే?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానం అంతాఇంతా కాదు.

పవన్ పై విమర్శలు చేసిన వాళ్లు ఎంత గొప్పవాళ్లు అయినా హైపర్ ఆది ఘాటుగా బదులిస్తారనే సంగతి తెలిసిందే.

సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ నిర్మాత నాగవంశీ పైకి నిర్మాతలా కనిపించినా ఆయనలో ఒక హీరో ఉన్నాడని చెప్పారు.నాగవంశీలో అర్జున్ రెడ్డి లాంటి ఆటిట్యూడ్ ఉందని హైపర్ ఆది కామెంట్లు చేశారు.

నాగవంశీలో బన్నీకి ఉన్న స్థాయిలో యాక్టివ్ నెస్ ఉందని హైపర్ ఆది పేర్కొన్నారు.నాగవంశీ త్రివిక్రమ్ తో ట్రావెల్ చేయడం వల్ల త్రివిక్రమ్ లో ఉన్న టైమింగ్, రైమింగ్ ఆయనలో కూడా ఉన్నాయని నాగవంశీ నిజాయితీతో ఏదైనా చెబితే ఆయన గురించి ఏదేదో రాసేస్తారని హైపర్ ఆది పేర్కొన్నారు.

నిర్మాత నాగవంశీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ప్రశ్నకు ఉదాహరణ చెబుతానని ఆది కామెంట్లు చేశారు.

Hyper Aadi Comments About Importance Of Pawan Kalyan Details, Hyper Aadi, Pawan
Advertisement
Hyper Aadi Comments About Importance Of Pawan Kalyan Details, Hyper Aadi, Pawan

భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ షూట్ నాలుగు రోజులు జరిగిందని ఒకరోజు ఢీ షూటింగ్ కోసం హాఫ్ డే లీవ్ కావాలని అని అడగగా ఢీ షో కావాలా పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకో అని ఆయన చెప్పారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.ఆ మాట విని నేను రెండు చేతులు జేబులో పెట్టుకుని భీమ్లా నాయక్ సెట్ కు వెళ్లిపోయానని హైపర్ ఆది కామెంట్లు చేశారు.

Hyper Aadi Comments About Importance Of Pawan Kalyan Details, Hyper Aadi, Pawan

హైపర్ ఆది వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ అంటే హైపర్ ఆదికి ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ ఘటనల ద్వారా ప్రూవ్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.హైపర్ ఆది 2024లో జనసేన తరపున పోటీ చేస్తారని వినిపిస్తున్నా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు