'హైడ్రా ' ఎఫెక్ట్ : రేవంత్ ఇమేజ్ తగ్గిందా పెరిగిందా ? 

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) సీఎం పదవిని బహుమానంగా కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది.

ఇక అప్పటి నుంచి ఆయన ఒకవైపు పార్టీకి మైలేజ్ తీసుకురావడంతో పాటు, వ్యక్తిగతంగాను తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పార్టీలోని తను వ్యతిరేక వర్గాన్ని కూడా తన దారికి తెచ్చుకుని ఇటు రాష్ట్రంలోనూ, అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా రేవంత్ వ్యవహరిస్తూ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) ని ఏర్పాటు చేయడమే కాకుండా నగర పరిధిలోని చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను, షాపింగ్ కాంప్లెక్స్ లను కూల్చి వేస్తున్నారు.

ఆ భవనాలు చాలావరకు రాజకీయ ప్రముఖులతో పాటు,  వీ వీఐపీలకు చెందినవి అయినా రేవంత్ మాత్రం లెక్క చేయడం లేదు.ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లకు  తలొగ్గకుండా హైడ్రా కు( HYDRA ) ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.హైడ్రా కూల్చిన తలలో కాంగ్రెస్ నేతలకు( Congress Leaders ) చెందిన భవనాలు ఉన్నా.

రేవంత్ మాత్రం ఈ కూల్చివేతలను కొనసాగిస్తూనే వస్తున్నారు .అయితే హైడ్రా వ్యవహారంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

Advertisement

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు కానీ,  అధిష్టానం పెద్దలకు మాత్రం ఈ విషయంలో రేవంత్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారట.ఒకవైపు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో,  ఈ తరహా చర్యలు పార్టీని దెబ్బతీస్తాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ కూల్చివేతలలో బడా పారిశ్రామిక వేత్తలు , రాజకీయ నాయకులవే కాకుండా , సామాన్యుల కు చెందిన భవనాలను సైతం కూల్చి వేస్తూ ఉండడం కాంగ్రెస్ కు చేటు తెస్తుందనే అభిప్రాయం చాలా మంది నేతల్లో ఉన్నాయి.అయితే రేవంత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

హైడ్రా వ్యవహారంలో వ్యక్తిగతంగా రేవంత్ ఇమేజ్ పెరిగినట్టే కనిపిస్తున్నా.రాజకీయంగా మాత్రం ఆయనకు , కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు