హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్..!

హైదరాబాద్ లోని మెట్రో కొత్త రికార్డ్ సాధించింది.ఒక్కరోజే సుమారు 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారని అధికారులు తెలిపారు.

ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికులు ట్రావెల్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నగరంలోని అమీర్ పేట్, ఉప్పల్ మరియు ఎల్బీనగర్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి కూకట్ పల్లి, నాగోల్ నుంచి హైటెక్ సిటీ రూట్లలో ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణించారు.అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించిన హైదరాబాద్ మెట్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు