మగాడు కాదని భార్య అనడంతో...ఆ వీడియోను అత్తమామలకు పంపాడు.! చివరికి ఏమైందంటే.?

తన భర్త నంపుసకుడు అనే కారణం చూపి విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్యకు ఓ హైదరాబాదీ షాకిచ్చాడు.

మరో మహిళతో కలిసి ఉన్న అశ్లీల వీడియోను అత్తమామలకు పంపించాడు.

ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే.! హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన విబవసు(32)కి చెన్నైలోని కొడుంగయూర్‌ ప్రాంతానికి చెందిన అనూషతో 2016లో పెళ్లయ్యింది.

అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయారు.తన భర్తకు మగతనం లేదని, అతడితో కలిసి ఉండటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

పెళ్లి కుదిర్చిన పెద్దలే వీరిని తిరిగి కలపడానికి ప్రయత్నించారు, కానీ వీలుపడలేదు.భర్త నంపుసకుడనే కారణంతో అనూష ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది.

Advertisement

ఇది తెలిసిన విభావసు మరో మహిళతో అశ్లీలంగా ఉన్న వీడియోను తీసి అనూష కుటుంబ సభ్యులకు పంపాడు.ధింపులు, అశ్లీల వీడియోను పంపడం తదితర కారణాలు చూపుతూ పోలీసులు విబవసుపై కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు విభావసును అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లికి ముందు నుంచే ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవని, పెళ్లయ్యాక కొద్ది రోజులకే గొడవలయ్యాయని చెప్పారు.పెళ్లయినా తాము శారీరకంగా కలవలేదని విబవసు పోలీసులకు తెలిపాడు.

Advertisement