ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ కుర్రాడు..!

ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-2022 సీజన్ ఓ పీడకలలా మారింది.ఆ జట్టుకు ఏ మాత్రం కలిసి రాని ఈ సీజన్‌లో ఓ ఉపశమనం దక్కింది.

హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ అనే ప్రతిభావంతుడైన ఆటగాడు ముంబై జట్టుకు దొరికాడు.ఈ 19 ఏళ్ల ఆటగాడు ముంబై మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా మారాడు.

స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ, ఆ జట్టు ఓడిపోయినా తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు.ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులు చేశాడు.

ఐపీఎల్ సీజన్‌లో టీనేజర్‌గా అత్యధిక పరుగులు చేసిన రిషబ్ పంత్ రికార్డును తిలక్ ఇప్పటికే అధిగమించాడు.ఈ సీజన్ ప్రారంభంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చాడు.

Advertisement

రవిచంద్రన్ అశ్విన్‌పై ఒక సిక్సర్ కోసం సాహసోపేతమైన రివర్స్-స్వీప్‌తో సహా కేవలం 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు.గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 33/4తో దారుణమైన పరిస్థితుల్లో ఉంది.

ఆ సమయంలో తిలక్ క్రీజులోకి వచ్చాడు.రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ అప్పటికే పెవిలియన్‌కు చేరుకున్నారు.

ముంబై మిడిల్ ఆర్డర్‌ అప్పటి వరకు సరిగ్గా ఆకట్టుకుంది లేదు.అయితే ముంబైకు తిలక్ వర్మ అపద్భావంధవుడిలా మారాడు.

సందర్భానికి అనుగుణంగా తన 32 బంతుల్లో 34 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు.దీంతో ముంబైకి క్లిష్ట పరిస్థితుల్లో చక్కటి విజయాన్ని అందించాడు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

తిలక్ వర్మ ఇన్నింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.తిలక్ వర్మ త్వరలో భారత్‌కు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ఎదుగుతారని ఆయన అన్నారు.

Advertisement

కఠిన పరిస్థితుల్లో ఆడుతున్నప్పుడు తాను మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్నాననే భావన ఓ కోశానా తిలక్ వర్మలో కనిపించలేదని రోహిత్ శర్మ అన్నాడు.ఒత్తిడిని చిత్తు చేసి, ప్రశాంతమైన, పరిణితితో కూడా ఆటను కనబర్చాడని కితాబిచ్చాడు.

తాజా వార్తలు