తప్పులో కాలేసిన ట్రంప్: సరిదిద్దేందుకు వైట్‌హౌస్ తంటాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తప్పులో కాలేశారు.ప్రస్తుతం డోరియన్ హరికేన్‌ ఫ్లోరిడా తీరాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే హరికేన్ గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న ట్రంప్.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే అలబామాకు హరికేన్ వల్ల ముప్పు ఉందంటూ అగ్రరాజ్యాధినేత ఆగస్టు 29న ఒక వీడియో విడుదల చేశారు.కానీ డోరియన్ ఫ్లోరిడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.

దీంతో తప్పును గుర్తించిన వైట్ హౌస్ అధికారులు నష్టనివారణా చర్యలు చేపట్టారు.వెంటనే జాతీయ హరికేన్ సెంటర్ ఇచ్చిన సమాచారంతో మరో వీడియోను రూపొందించారు.

Advertisement

ఇందులో డోరియన్ హరికేన్ ఫ్లోరిడా నుంచి గల్ఫ్ తీరం వైపుగా పయనిస్తోందని ట్రంప్ తెలుపుతున్నట్లుగా ఉంది.జరిగిన పొరపాటుపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించగా.

‘‘ ఐ డోంట్ నో’’ అనే సమాధానం వచ్చింది.

కాగా.డోరియన్ ధాటికి ఫ్లోరిడాలోని బహమాస్ నగరం నామరూపాల్లేకుండా పోయింది.ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20 మంది మరణించగా.

వందలాది మంది క్షతగాత్రులయ్యారు.వరద నీరు నగరంలోకి పోటెత్తడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

అధ్యక్షుడు ట్రంప్ పోలెండ్ పర్యటనను సైతం రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఫ్లోరిడా తీరం ప్రాంతంలోని పలు కౌంటీలతో పాటు జార్జియా, కరోలినాల్లో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు