కించపరిచేలా పోస్టులు..! చికోటి ప్రవీణ్ ఫిర్యాదు

క్యాసినో వ్యవహరంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.దీనిలో భాగంగా చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు.

మరోవైపు ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి.దీంతో తన పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ హైదరాబాద్‎లోని సీసీఎస్ పోలీసులకు చికోటి ఫిర్యాదు చేశాడు.

దాని వల్ల ప్రజల్లో తనకు చెడ్డ పేరు వస్తుందని, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలని కోరారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు