ఏఐ వింతలు.. డాగీతో కలిసి షాపింగ్ చేసిన రోబో! వైరల్ వీడియో

ప్రపంచం రోజురోజుకి మారుతోంది.ఈ మార్పులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (AI).

గత కొద్దిరోజులుగా మన జీవితాల్లో ఏఐ టెక్నాలజీ అనివార్య భాగమైంది.పని వేగం పెంచడం, కొత్త విషయాల్ని నేర్చుకోవడం, మెరుగైన ఎంటర్టైన్మెంట్, సౌకర్యాలు అందించడం వంటి అనేక మార్గాల్లో ఏఐ మనల్ని ప్రభావితం చేస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానవ సంబంధాలు, అనుభూతులు కూడా ఈ సాంకేతికత ద్వారా కొత్త మలుపులు తిరుగుతున్నాయి.

Humanoid Robot Goes Shopping With Dog Robot In China Shocks Netizens With Human

ఇప్పుడు ఏ సోషల్ మీడియా వేదికను తీసుకున్నా అందులో ఏఐ గురించే చర్చలు, డిస్కషన్లు నడుస్తున్నాయి.ముఖ్యంగా హ్యూమనాయిడ్ రోబోట్స్( Humanoid Robot ) చేస్తున్న వెరైటీ స్టంట్లు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇవి తమ పనితీరు, ప్రవర్తనతో నేటి యువతను సైతం ఆకట్టుకుంటున్నాయి.

Advertisement
Humanoid Robot Goes Shopping With Dog Robot In China Shocks Netizens With Human

అత్యాధునిక సాంకేతికతను సూచించే ఓ తాజా ఉదాహరణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.చైనా( China ) దేశంలోని షెన్‌జెన్ నగరంలో గల ఓ పెద్ద షాపింగ్ మాల్‌లో జరిగిన ఆసక్తికర సంఘటన ప్రస్తుతం తెచ్చా వైరల్ అవుతుంది.

Humanoid Robot Goes Shopping With Dog Robot In China Shocks Netizens With Human

వీడియో వివరాల ప్రకారం, మాల్‌లో మనుషులతో పాటు ఓ హ్యూమనాయిడ్ రోబో కూడా షాపింగ్‌కి వచ్చింది.అది తన వెంట చిన్న డాగీ రోబోను( Dog Robot ) కూడా తీసుకొచ్చింది.షాపింగ్ పూర్తి చేసుకుని కారు పార్కింగ్ ఏరియాలోకి వెళ్లేటప్పుడు, ఆ రోబో అచ్చం మనిషిలా అటూ ఇటూ చూసింది.

వాహనాల రాకపోకలను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశర్యపోతున్నారు."నువ్వే ఒక మరమనిషివి.

మళ్లి నీ వెంట డాగీ కూడా!" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.రోబో ప్రవర్తన, హావభావాలు చేసిన ప్రదర్శన చూసి చాలా మంది మంత్ర ముగ్ధులయ్యారు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఈ సంఘటన మానవ జీవితం మీద ఏఐ పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మానవులకు సహాయం చేయడమే కాదు, మన అనుభూతులకు అద్భుతమైన తోడుగా కూడా ఏఐ మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

మొత్తానికి, ఆధునిక సాంకేతికత అభివృద్ధిలో ఇదొక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు