హైదరాబాద్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు

హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన మాఫియా.ఈ మాఫియా కోరలలో కొందరు తెలిసి, తెలియక చిక్కుకుంటూ ఉంటారు.

ఒక్కసారి వీరి వలలో చిక్కితే ఏదో ఒక కథ చెప్పి విదేశాలలో మంచి ఉద్యోగాలు, లక్షలలో జీతాలు, మంచి జీవితం అని చెప్పి పంపించడానికి ట్రై చేస్తారు.అక్కడికి నకిలీ పాస్ పోర్ట్, వీసాల మీద వెళ్ళిన తర్వాత పోలీసులకి చిక్కడం లేదంటే, మాఫియా చేతిలో బందీగా మారడం జరుగుతుంది.

ఇలాంటి మోసాలకి హైదరాబాద్ చాలా ఫేమస్ తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకి వలస కూలీలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు.ఇలాంటి వారిని టార్గెట్ గా చేసుకొని నకిలీ వీసా, పాస్ పోర్ట్ లతో అరబిక్ దేశాలకి పంపిస్తున్న ముఠాని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు.

ముఠాకి చెందిన 18 సభ్యులని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి వారి నుంచి 250 నకిలీ పాస్ పోర్ట్, వీసాలు స్వాదీనం చేసుకున్నారు.అలాగే వారి ఆఫీస్ పై దాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు