పక్కనే భారీ పాములు.. భయం లేకుండా ఆడుకుంటున్న వ్యక్తి!

సాధారణంగా ఆమడ దూరంలో పాము( Snake ) కనిపిస్తేనే చాలా వణికి పోతూ అక్కడి నుంచి పారిపోతాం.

ఆ పాము చుట్టుపక్కల తిరిగితే ప్రాణాలకే ప్రమాదమని వాటిని చంపేస్తుంటాం.

లేదంటే దూరంగా తరుముతాము.ప్రజల్లో పాము అంటే అంత భయం ఉంది కానీ ఒక వ్యక్తి మాత్రం రెండు అతి పెద్ద పాములు తన పక్కనే ఉన్నా ఏమాత్రం బెదరకుండా చాలా ప్రశాంతంగా గోల్ఫ్ ఆట ఆడాడు.

పక్కనే పాములున్నా అతడు ఆటలో పడిపోయి ఉండటం చూసి మిగతావారు షాక్ అయ్యారు.కొందరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

ఆస్ట్రేలియా( Australia ) దేశం, బ్రిస్బేన్ నగరంలోని గోల్ఫ్ కోర్స్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.ఈ కోర్స్‌లో ఓ ఆటగాడు గోల్ప్ఆ( Golf )డుతుండగా అదే మైదానం పైకి రెండు పెద్ద పాములు ఒకదానికొకటి పెన వేసుకొని సయ్యాట ఆడుతూ అతడికి దగ్గరగా వచ్చాయి.దీనిని గమనించి చాలామంది షాక్ అయ్యారు కానీ సదరు ప్లేయర్ మాత్రం కొంచెం కూడా దొరకలేదు తన ఆటను అలాగే కొనసాగించాడు.

కొద్ది అడుగుల దూరంలోనే రెండు అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయని, అవి తలుచుకుంటే సెకండ్లలోనే కాటు వేయగలవని తెలిసినా అతడు మాత్రం బెదరలేదు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూనిల్యాడ్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్( Instagram ) పేజీ షేర్ చేసింది.ఇది చూసి చాలామంది షాక్ అవుతున్నారు.అతడి ధైర్యాన్ని మరికొందరు మెచ్చుకుంటున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.

దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!
Advertisement

తాజా వార్తలు