అన్ని పుణ్యక్షేత్రాలలో ఉచిత వసతి.. కానీ తిరుమలలో మాత్రం..

మన దేశవ్యాప్తంగా ఉన్న చాలా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు తిరుమల పుణ్యక్షేత్రానికి ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

ఈ దర్శనానికి వచ్చిన భక్తులకు వసతి గృహాల ధరలు ఎక్కువగా ఉంటాయి.

కానీ శిరిడి వెళ్తే అక్కడ వసతి సదుపాయం కోసం భక్తులు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.అందుబాటులో సత్రాలు అతి తక్కువ ధరకే దొరుకుతాయి.

TTD Hikes Room Rentals In Tirumala,TTD,Tirumala,Room Rentals,Accomadation,Srisai

అదే కాశీకి వెళ్లిన వసతి కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.చాలా తక్కువ ధరకే వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి.

మన రాష్ట్రంలోని శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఇదే పరిస్థితి ఉంటుంది.అక్కడ వసతితో పాటు ఉచిత భోజనం కూడా పెడుతూ ఉంటారు.

Advertisement

విచిత్రం ఏమిటంటే తిరుమలలో మాత్రం వసతి గృహాల ధరలు భారీగా ఉంటాయి.స్టార్ హోటల్ లో స్థాయిలో రూమ్ రెంట్లు కూడా పెంచేస్తున్నారు.500 రూపాయలు ఉండే రూమ్ చార్జీలు తాజాగా రూ.1700లకు పెంచారు.100 రూపాయలు ఉండే రూము చార్జీని త్వరలో రూ.1500 చేయబోతున్నారని సమాచారం.ఇప్పటికే రూము రెట్లను భారీగా పెంచడం జరిగింది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి ఆధ్వర్యంలో టిటిడి బోర్డు ఏర్పడిన తర్వాత ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారో, మూడోసారో అని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ధరలు పెరగడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఖర్చులు భరించలేక తిరుమలకు వచ్చేవారు తగ్గిపోతున్నారని కూడా సమాచారం.

ఒక కుటుంబం తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే దాదాపు పదివేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలు దేవుడి వైపు చూడాలంటే భయపడేలా ధరలను పెంచేస్తున్నారని చాలామంది ప్రజలు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు