తెలంగాణ బడ్జెట్ పై భారీ కసరత్తు..!!

తెలంగాణ బడ్జెట్ పై భారీ కసరత్తు జరుగుతోంది.ఈ మేరకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ రూపకల్పన దిశగా వివిధ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.

ఇందులో భాగంగా నిన్న ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క ఇవాళ రహదారులు, భవనాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై సమీక్షించారు.ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.

Validation Check 2026
Advertisement