ఏపీలో బీజేపీ ప్రతిపక్షం అనిపించుకోవడానికి తొందర పడుతుందిగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయింది.

ఆసను డబుల్ డిజిట్ సీట్లు కూడా తెచ్చుకున్న దాఖలాలు లేవు.

ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఇంతకాలం కొద్దో గొప్పో నెట్టుకొచ్చింది.ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీని తెలుగు ప్రజలు అసలు బలమైన పార్టీగా కూడా గుర్తించరు.

ఆ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసిన వారి పేర్లు కూడా చాలా మందికి తెలియదు బీజేపీ పార్టీది ఏపీలో అలాంటి పరిస్థితి.అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

అందులో భాగంగా టీడీపీ పాతకాపులని పార్టీలో చేర్చుకొని తామేదో బలపదిపోయాం అనే బలుపుతో హడావిడి చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది.కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండానే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తామే అని ప్రచారం చేసుకుంటుంది.

Advertisement

దీని వెనుక బీజేపీ చాలా పెద్ద ఆలోచన ఉందనే మాట వినిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి చెందిన శాసన సభ్యులు, కొందరు సీనియర్ నాయకులు బీజేపీలో ఎప్పుడెప్పుడు చేరాలా అని ముహూర్తాలు చూసుకుంటున్నట్లు రాజకీయాలలో వినిపిస్తుంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యులతో బిజేపీ రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతున్నారు.బీజేపీలో చేరే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారాల జల్లులు కిరిపిస్తుంది.

గత నెలంతా తెలుగుదేశం శాసనసభ్యులతో చర్చలు జరిపిన కమలనాథులు… కొత్త చేరికలకు శ్రావణమాసాన్ని ముహూర్తంగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యులు బీజేపీలో చేరితే తమనే అసలైన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశమూ ఉందంటున్నారు.

మరి ఇంది ఎంత వరకు జరుగుతుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి.

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు