మహేష్ బాబు సౌందర్య హీరో హీరోయిన్స్ గా మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా ?

యమలీల( yamaleela ).ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చి అతి పెద్ద విజయాన్ని సాధించింది ఈ చిత్రం.

ఈ చిత్రం 1994లో విడుదలైంది.అలాగే ఈ సినిమాలో ఇంద్రజ మరియు అలీ హీరో హీరోయిన్స్ గా నటించగా కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) యముడుగా నటించి యమలీల సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ఆలి హీరోగా చాలా చిత్రాల్లో హీరోగా నటించాడు.ఇంద్రజ సైతం హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి నటి అని అనిపించుకుంది.

ఎస్ వి కృష్ణారెడ్డి కెరియర్ లో కూడా ఇదొక మంచి సినిమాగా నిలిచిపోయింది.అయితే ఈ సినిమాకి మొదటగా అనుకున్న హీరో హీరోయిన్స్ ఇంద్రజ మరియు ఆలీ కాదు అనే విషయం తాజాగా వైరల్ గా మారింది .

Advertisement

అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ కథను తయారు చేసిన సమయంలో మొదటగా ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు( Mahesh Babu ) హీరోయిన్ గా సౌందర్య ఉంటే బాగుంటుందని అనుకున్నారట.వారి కోసమే ఈ కథను కూడా సిద్ధం చేశారట.మహేష్ బాబు తో సినిమా చేయించాలని అలాగే ఈ సినిమా కథ కృష్ణ గారికి వినిపించిన సమయంలో మరొక మూడేళ్ల పాటు ఆగాలని మహేష్ చాలా చిన్నవాడు అని అప్పుడే హీరోగా పరిచయం చేయలేను అంటూ తెలిపారట.

ఈ సినిమా విడుదలైన సమయానికి మహేష్ బాబుకి కేవలం 19 ఏళ్ళు మాత్రమే.ఇక సౌందర్య వయసు 22 ఏళ్ళు.సౌందర్య మహేష్ బాబు కన్నా మూడు సంవత్సరాలు పెద్దది.

ఈ సినిమా విడుదలైన తర్వాత ఐదేళ్లకి రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇలా సౌందర్య తో కలిసి నటించే అవకాశం మహేష్ బాబు చేజారిపోయింది.ఏది ఏమైనా మహేష్ లాంటి ఒక హీరో యమలీల సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉండి ఉంటే అతడి కెరియర్ ఈ రేంజ్ లో ఉండేది కాదేమో.

ఆ రోజు కృష్ణ గారు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా కరెక్టే అనిపిస్తుంది కదా.మీకు కూడా కరెక్టే అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు