ఖర్జూరం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచుతుంది‌.. ఇలా వాడితే మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది!

ఖర్జూరం.( Dates )మధురమైన రుచితో పాటు బోలెడన్ని పోషక విలువలు కలిగి ఉంటుంది.

అందుకే ఆరోగ్యపరంగా ఖర్జూరం అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.ఎన్నో జబ్బులను అడ్డుకుంటుంది.

ముఖ్యంగా రక్త హీనతను నివారించడానికి, రక్తపోటును అదుపు చేయడానికి, ఎముకలను దృఢపరచడానికి ఖర్జూరం ఎంతో బాగా సహాయపడుతుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు ఖర్జూరం అందాన్ని సైతం పెంచుతుందని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.స్కిన్ వైట్నింగ్ కి ఖర్జూరం చాలా ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.

మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఖర్జూరంను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలను వేసుకోవాలి.అలాగే నాలుగు ఎండు ద్రాక్ష వేసి ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష తో పాటు పావు కప్పు తరిగిన బొప్పాయి పండు( Papaya ) ముక్కలు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Chandan Powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించండి చాలు బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు.ముఖ్యంగా ఈ రెమెడీ వల్ల మీ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ పై డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే తొలగిపోతాయి.మచ్చలు మొటిమలు దూరం అవుతాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నుంచి విముక్తి పొందుతారు.మరియు మీ చర్మం అందంగా ఆకర్షణీయంగా సైతం మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు