సోయా బీన్స్ ఆరోగ్యానికే కాదు హెయిర్ ఫాల్ కు సైతం అడ్డుకట్ట వేస్తాయి.. ఎలాగంటే?

సోయా బీన్స్. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

ప్రస్తుత రోజుల్లో సోయా బీన్స్ ను ఎందరో విరివిరిగా వాడుతున్నారు.

సోయా బీన్స్ లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందుకే సోయా బీన్స్ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు హెయిర్ ఫాల్ కు సైతం అడ్డుకట్ట వేయగల సామర్థ్యం సోయా బీన్స్ కు ఉంది.

ఇంతకీ సోయా బీన్స్ ను ఉపయోగించి జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు సోయా బీన్స్ ను వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement
How To Use Soya Beans From Prevent Hair Fall Details! Hair Fall, Stop Hair Fall,

మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సోయా బీన్స్ వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బ‌ల‌ కరివేపాకు, రెండు రెబ్బల వేపాకు వేసుకోవాలి.

ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

How To Use Soya Beans From Prevent Hair Fall Details Hair Fall, Stop Hair Fall,

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

How To Use Soya Beans From Prevent Hair Fall Details Hair Fall, Stop Hair Fall,

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్క‌సారి సోయా బీన్స్ తో పైన చెప్పిన విధంగా హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాల‌డం క్రమంగా త‌గ్గు ముఖం పడుతుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల పల్చటి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే దూరమవుతుంది.

Advertisement

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా సోయా బీన్స్ తో పైన చెప్పిన రెమెడీని పాటించండి.

తాజా వార్తలు