డార్క్ సర్కిల్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా.. పుదీనాతో ఇలా చేస్తే వారంలో మాయం అవుతాయి!

డార్క్ సర్కిల్స్( Dark circles ).మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.

కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలు చాలా ఉన్నాయి.ప్రధానంగా చూస్తే స్ట్రెస్, పలు రకాల మందుల వాడకం, కంటి నిండా నిద్ర లేకపోవడం, స్క్రీన్ టైమ్‌ ఎక్కువ అవ్వడం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

అబ్బాయిలు పెద్దగా ఈ సమస్యను పట్టించుకోరు.కానీ అమ్మాయిలు మాత్రం డార్క్ సర్కిల్స్ వల్ల చాలా సతమతమవుతుంటారు.

వాటిని వదిలించుకోవడానికి తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.అయితే అసహ్యంగా కనిపించే డార్క్ సర్కిల్స్ ను వదిలించడానికి పుదీనా ఆకులు( Mint leaves ) ఉత్తమంగా సహాయపడతాయి.

Advertisement
How To Use Mint Leaves For Dark Circles, Dark Circles Removal Serum, Mint Leave

సాధారణంగా మనం పుదీనా ఆకులను నాన్ వెజ్ వంటల్లో మాత్రమే ఉపయోగిస్తుంటాము.కానీ పుదీనాతో ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ముఖ్యంగా కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను నివారించడానికి పుదీనాను ఉపయోగించవచ్చు.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.

How To Use Mint Leaves For Dark Circles, Dark Circles Removal Serum, Mint Leave

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు పుదీనా ఆకులను లైట్ గా క్రష్ చేసి వేసుకోవాలి.చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించి ఆపై స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మింట్ సీరం రెడీ అవుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

How To Use Mint Leaves For Dark Circles, Dark Circles Removal Serum, Mint Leave
Advertisement

రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి తయారు చేసుకున్న సీరం ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.ఆపై ఐదు నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్ లో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.డార్క్ సర్కిల్స్ మరీ అధికంగా ఉంటే ఉదయం స్నానం చేయడానికి ముందు కూడా సీరంను వాడండి.

నిత్యం ఈ మింట్‌ సీరంను కనుక వాడితే కేవలం వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్‌ మాయం అవుతాయి.మ‌రియు కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే క్ర‌మంగా దూరం అవుతాయి.

తాజా వార్తలు