అందానికి మందారం.. ఇలా వాడితే మచ్చలేని మెరిసే మృదువైన చర్మం మీ సొంతం!

పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో కనిపించే చెట్టు మందారం( Hibiscus ).మందార పువ్వులను పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇంకొందరు జుట్టు సంరక్షణకు వాడుతుంటారు.అయితే అందానికి కూడా మందారం అండగా నిలుస్తుంది.

ముఖ్యంగా మందార పువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మచ్చలేని మెరిసే మృదువైన చర్మం( Spotless Skin ) మీ సొంతమవుతుంది.సహజంగానే మీరు అందంగా మెరిసిపోతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మందార పువ్వులతో అందాన్ని ఎలా పెంచుకొవచ్చో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా పది మందార పువ్వులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పెటల్స్ ను సపరేట్ చేసుకోవాలి.ఆపై తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు బాదం నూనె వేసుకోవాలి.

అలాగే మందారం పువ్వు రేకులను( Hibiscus Petals ) కూడా వేసి స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

అనంతరం ఆయిల్ ను చల్లార‌పెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన తర్వాత స్టైనర్ సహాయంతో ఆయిల్ లో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ మందారం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు లేదా ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న మందారం ఆయిల్( Hibiscus Oil ) ను ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకొని కనీసం పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

ప్రతిరోజు గనక ఇలా చేస్తే మందారం ఆయిల్ లో ఉండే పలు సుగుణాలు మీ చర్మ ఛాయను పెంచుతాయి.ముడతలను మాయం చేస్తాయి.మచ్చలను నివారిస్తాయి.

Advertisement

చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.మొటిమల‌కు( Pimples ) అడ్డుక‌ట్ట వేస్తాయి.

అలాగే ఈ మందారం అయిల్ ను వాడ‌టం వ‌ల్ల‌ చర్మం కాంతివంతంగా మారుతుంది.స్కిన్ టైట్ అవుతుంది.

ఫైనల్ గా మచ్చలేని మెరిసే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు