వెన్నునొప్పి ఉపశమనానికి అల్లంను ఎలా ఉపయోగించాలి

ప్రపంచ వ్యాప్తంలో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండా అందరిని బాధించే సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటి.

ప్రతి 30 మందిలో ఒకరు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు.

ఈ సమస్య రావటానికి జీవనశైలి,ఆహారపు అలవాట్లు కొంత కారణం కావచ్చు.అయితే వెన్నునొప్పికి ప్రధాన కారణాలు ప్రధానంగా వయస్సు, కాల్షియం లోపం, బోలు ఎముకల వ్యాధి, అధిక బరువు లేదా ఊబకాయం, గాయాలు, శస్త్రచికిత్సలు, వెన్నెముక సంక్రమణ వ్యాధులు మొదలైనవి అని చెప్పవచ్చు.

ఎముకలు క్రమంగా బలహీనం అయ్యి వెన్నునొప్పి రావటానికి కారణం అవుతుంది.నొప్పి తగ్గటానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.

అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన ఆ ప్రభావం కాలేయం,కిడ్నీల మీద పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.అందువల్ల మనకు దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో సమర్ధవంతంగా వెన్నునొప్పి నుండి బయట పడవచ్చు.

Advertisement
How To Use Ginger For Back Pain-వెన్నునొప్పి ఉపశ�
How To Use Ginger For Back Pain

అల్లంలో జింజరోల్, పోలిఫెనోల్స్, ఫ్లేవనోయిడ్స్ మరియు టానిన్లు,యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన నొప్పులను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.ప్రతి రోజు మూడు గ్రాముల అల్లంను తినటం ద్వారా వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు.మూడు గ్రాముల అల్లంను బాగా కడిగి తురమాలి.

తురిమిన అల్లంను ఆహారంలో తీసుకోవచ్చు.లేదా పాలు,టీ,నీటిలో ఇలా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు.

ఈ విధంగా ప్రతి రోజు క్రమం తప్పకండా అల్లంను తీసుకుంటే వెన్నునొప్పి తగ్గిపోతుంది.

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేసే ఆయుర్వేద చిట్కాలు ఇవే!
Advertisement

తాజా వార్తలు