వాట్సాప్ లో సరికొత్తగా ఫిల్టర్స్ ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..?

వాట్సప్( Whatsapp ) తన యూజర్ల భద్రత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ సేవలను మరింత సులభతరం చేస్తోంది.

వాట్సప్ ఇంటర్ ఫేస్ లో మార్పులు సహా కీలక అప్డేట్లను తీసుకొస్తోంది.

తాజాగా వాట్సాప్ అప్డేట్ లలో ఫిల్టర్స్ అనే సరికొత్త ఫీచర్( Filters Feature ) ను అందుబాటులోకి తెచ్చింది.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS రెండిటిలోనూ అందుబాటులోకి వచ్చింది.

కానీ ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ చాట్ ను రీడ్, అన్ రీడ్, గ్రూప్ లాంటి కేటగిరీలను ఫిల్టర్ చేస్తుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అవసరమైన ఫీచర్లను చాలా వేగంగా స్పందించవచ్చు.

Advertisement

ఈ ఫీచర్ హోమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

ఈ ఫీచర్ తో పాటు వాట్సాప్ అనేక కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.వాట్సాప్ ఫీచర్ ట్రాకర్( Whatsapp Feature Tracker ) ఆధారంగా వాట్స్అప్ ఆసక్తికర ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది.ఈ ఫీచర్ రీసెంట్లీ ఆన్లైన్ పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వాట్సప్ రీసెంట్లీ ఆన్లైన్ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే ఈ ఫీచర్ కూడా అందరికీ అందుబాటులోకి రానుంది.

ఇక వాట్సప్ వెబ్ వెర్షన్( Whatsapp Web Version ) లోను ఇదే తరహా మార్పులు చేస్తోంది.ఈ మార్పుల వల్ల నావిగేషన్ మెరుగుపడనుంది.వెబ్ వెర్షన్ లో ఈ నావిగేషన్ ఎడమవైపున కనిపించనుంది.ఈ ఫీచర్ వాట్సప్ వెబ్ బీటా 2.3000.1012734542 అప్ డేట్ లో ఉంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే డిజైన్ వాట్సప్ వెబ్ ను సులభంగా వినియోగించుకోవచ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఈ ఫీచర్ కు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ ను WAbetainfo షేర్ చేసింది.ఆ స్క్రీన్ షాట్ లో చాట్, కమ్యూనిటీ, ఛానల్స్, స్టేటస్ సహా ఇతర అన్ని ఐకాన్ పొజిషన్ లో వచ్చిన మార్పును గమనించవచ్చు.

Advertisement

ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.టెస్టింగ్ దశ పూర్తయిన వెంటనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

తాజా వార్తలు