శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుతాయని తెలుసా?

శంఖు పుష్పాల( Butterfly Pea Flowers ) గురించి పరిచయం అక్కర్లేదు.

చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ పుష్పాల్లో ఎన్నో రకాల పోషకాలు మ‌రియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అందుకే చాలా మంది శంఖు పుష్పాలతో టీ తయారు చేసుకుని నిత్యం తీసుకుంటూ ఉంటారు.అయితే శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును( Hair ) కూడా పెంచుతాయి.

వివిధ కేశ సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి.మరి ఇంతకీ కురులకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది నుంచి పది శంఖు పుష్పాలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టీ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక గ్లాసు హాట్ వాటర్ పోసి బాగా కలపాలి.ఆపై మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేత్తో క్రష్ చేసుకోవాలి.దాంతో వాటర్ అనేది జెల్ రూపంలోకి మారుతుంది.

క్లాత్ సహాయంతో ఆ జెల్ ను సపరేట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఒక మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకావాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే మీ కురులకు చక్కని పోషణ అందుతుంది.జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అదే సమయంలో ఈ టానిక్ జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.కురులను ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

Advertisement

మరియు జుట్టును సిల్కీగా షైనీ గా సైతం మెరిపిస్తుంది.

తాజా వార్తలు