దట్టమైన కురుల కోసం తమలపాకులు.. ఇంతకీ ఎలా ఉపయోగించాలో తెలుసా?

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.పల్చటి కురుల కారణంగా ఏమాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేరు.

పైగా పల్చటి జుట్టు వల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు తమలపాకులు చాలా అద్భుతంగా సహాయపడతాయి.తమలపాకుల్లో( betel leaves ) ఉండే ఔషధ గుణాలు మరియు పోషకాలు జుట్టును దట్టంగా మార్చడానికి తోడ్పడతాయి.

మరి ఇంతకీ తమలపాకులను జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు తమలపాకులు మరియు నాలుగు రెబ్బ‌లు కరివేపాకు( curry leaves ) వేసి వాటర్ యాడ్ చేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసుకున్న తమలపాకు, కరివేపాకు మిశ్రమాన్ని వేసుకోవాలి.

మరియు వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ) కూడా వేసి చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అప్పుడు స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కి అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

దేవర సాంగ్ కాపీ సాంగ్ అంటూ ట్రోల్స్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారుగా!
వేస‌వి వేడిని త‌ట్టుకోలేక‌పోతున్నారా? అయితే ఈ సూప‌ర్ డ్రింక్ మీకే!

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల అదిరిపోయే లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.పల్చటి జుట్టును దట్టంగా మారుస్తుంది.

Advertisement

జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.హెయిర్ రూట్స్ ని బలోపేతం చేస్తుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా నల్లగా పెరుగుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

మరియు హెయిర్ బ్రేకేజ్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు