కరోనా నుంచి కోలుకున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

కరోనా వైరస్.ఈ పేరు వింటే ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ బారిన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి రెండు కోట్లమంది పడ్డారు.

అయితే అందులో 7 లక్షలమందికిపైగా కరోనాకు బలవ్వగా.

How To Take Diet After The Corona Virus Diet, Corona Virus, Covid-19, Food Habi

కోటి 50 లక్షలమంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా నుంచి కోలుకున్న వారికి ఎలాంటి ఆహారం పెట్టాలి ? అసలు ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆకలి తక్కువగా ఉండటం, ఆహారం రుచిలేకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం చాలా కష్టంగా మారింది.

అయితే ఈ సమయంలో శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.ఎక్కువ విటమిన్లు, ప్రోటీనులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ఉదయం టిఫిన్ సమయంలో గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి.

Advertisement

మధ్యాహ్నం, రాత్రి భోజనం సమయంలో అన్నం లేదా రొట్టెలతో పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, చికెన్‌, చేప వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి.నిద్ర పోయే రెండు గంటల ముందు భోజనం చెయ్యాలి.

ఉడికించిన వేరుశెనగ, వేయించిన బఠాణీలు, సెనగలు, నానబెట్టిన బాదం, ఆక్రోట్‌, అన్ని రకాల పండ్లు, ఉడికించిన సెనగలు, అలసందలు, బొబ్బర్లు, పెసలు లాంటి పప్పులు స్నాక్స్ లా తీసుకుంటే శక్తి పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు.ఇంకా నానబెట్టిన బాదం తీసుకుంటే మంచిది.

అలాగే కాఫీలు, టీలు, ధూమపానం, మద్యపానం వంటి వాటికి పూర్తిగా దూరం ఉండాలి.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!
Advertisement

తాజా వార్తలు