టీ పౌడర్ తో హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే?

ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంది.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో టీ ( Tea )ఒకటి.

మితంగా తీసుకుంటే టీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా స్ట్రెస్ ను తగ్గించడానికి, మూడ్ ను మార్చ‌డానికి టీ ఎంతో బాగా సహాయపడుతుంది.

అయితే హెయిర్ ఫాల్( Hair fall ) కు చెక్ పెట్టే సత్తా కూడా టీ కి ఉంది.చాలా టీలలో కెఫిన్ ఉంటుంది.

ఇది సహజంగా జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్‌ను అణిచివేస్తుంది.అలాగే టీ జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.

Advertisement

కెఫీన్ ( Caffeine )హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరిచేందుకు మరియు మీ తలకు రక్త ప్రవాహాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.ఇది జుట్టు ఎదుగుదలను అద్భుతంగా ప్రోత్సహిస్తుంది.మరి ఇంతకీ టీ ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్( Tea powder ), వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ ( Fenugreek powder )వేసుకొని దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యుల‌ర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాటర్ ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అంతేకాదు టీ పౌడర్ ఇప్పుడు చెప్పిన విధంగా ఉపయోగిస్తే దెబ్బతిన్న జుట్టు మళ్లీ మృదువుగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

చికాకు కలిగించే స్కాల్ప్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.మరియు చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు